
* కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మించండి
ఆకేరు న్యూస్ డెస్క్ : వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేసి కొత్తగూడెంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని కోరుతూ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఢిల్లీలో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ మామునూరు,కొత్తగూడెం విమానాశ్రయాల నిర్మాణంపై మంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కొత్తగూడెం విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సరియైన ప్రదేశాన్ని చూపించకపోవడం వలన కలగానే మిగిలిపోతోందన్నారు, అలాగే వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, DPRలో ఉన్న విధంగా 800ఎకరాలు కేటాయించాలి, కానీ 600 ఎకరాలు మాత్రమే కేటాయించింది, మిగతా 200 ఎకరాల భూమి కేటాయింపు చేస్తే, వెంటనే పని ప్రారంభం చేస్తామని మంత్రి తెలిపారని వివరించారు.
…………………………………………………..