* ఢిల్లీలో రేవంత్.. రాహుల్‌కు ఆహ్వానం
* కేంద్రమంత్రులతోనూ భేటీ
* కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఇంజనీర్లతో సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు రైతు రుణమాఫీని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government). ఇప్పటికే ప్రారంభమైన ఈ కార్యక్రమం దశలవారీగా సాగుతోంది. ఈనేపథ్యంలో వరంగల్(Warangal) లో భారీ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చాటి చెప్పాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన సభలోనే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ప్రకటన చేసింది. ఈమేరకు మళ్లీ వరంగల్ లోనే సభ పెట్టి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Congress leader Rahul Gandhi) ని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాహుల్‌ను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అలాగే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రులతోనూ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి పాటిల్ (Minister Patil) తో రేవంత్ (Revanth), ఉత్తమ్(Uttam) భేటీ కానున్నారు. అనంతరం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంజనీర్ల (National Dam Safety Authority Engineers) తో సమావేశం కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram project) పునర్వినియోగం, మరమ్మతులపై చర్చలు జరపనున్నారు.
———————