* రాహుల్, సోనియాలపై అక్రమ కేసులు పెట్టారని నిరసన
* పాల్గొన్న ఏఐసీసీ ఇన్చార్జి, మంత్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ (CONGRESS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్డ్ హెరాల్డ్ కేసులో సోనియా(SONIA), రాహుల్(RAHUL) పేర్లను చార్జ్ షీట్లో పేర్కొనడానికి నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యతిథిగా హాజరయ్యారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. ఈడీ డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ మాట్లాడుతూ బిహార్‌లో ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించాలని బీజేపీ (BJP) యత్నిస్తోందని విమర్శించారు. గుజరాత్లో కాంగ్రెస్ సభలతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. రాహల్‌ను అప్రదిష్ట పాలు చేసేందుకు దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. రాజకీయ కక్ష చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలూ జరగలేదన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
