Mulugu Road Safety Measures
* రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
– అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్
ఆకేరు న్యూస్,ములుగు:
జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం అదనపు కలెక్టర్ నూతన కలెక్టరేట్ తన ఛాంబర్ లో రోడ్డు భద్రతా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై మల్లంపల్లి, పందికుంట, యువజన శిక్షణ కేంద్రం, జాకారం, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వేగ నియంత్రణ పట్టీలు, సూచిక బోర్డులు,రేడియం స్టికర్లు, ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారికి అనుసంధానమయ్యే రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ టి ఓ ఈశ్వర్ సింగ్ ఠాగూర్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులు, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, మునిసిపల్ కమిషనర్ సంపత్, ఆర్టి సి, పోలీస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
