
* కేంద్ర ప్రభుత్వ డెడికేషన్తోనే గ్రీన్ సిగ్నల్
* ఆ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు
* కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు
* బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ డెడికేషన్తోనే వరంగల్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని ఎంపీ రఘునందన్ రావు (Mp Raghunandhan rao) అన్నారు. మామునూరు ఎయిర్ పోర్టుతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రేవంత్ నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ (Brs) నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ ఎస్ లోకి వెళ్లిపోయేలా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్ ఎల్బీసీ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా అక్కడకు వెళ్లే టైం రేవంత్‌కు లేదా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ(RahulGandhi) అపాయింట్మెంట్ లేక రేవంత్ తిరిగి వచ్చారు. ఆయనను కలిస్తే ఒక్క ఫొటో కూడా బయటకు రాదా అన్నారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలంటూ అధిష్ఠానానికి లేఖ రాయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సూచిస్తున్నా అని తెలిపారు. కిషన్ రెడ్డి సౌమ్యుడని, ఆయన గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదని వెల్లడించారు.
…………………………………………..