* యువతను చెడుదారివైపు మళ్లిస్తోంది..
* మహారాష్ట్ర యువత ఆలోచించాలి..
* ప్రధాని నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్ డెస్క్ : మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi) కాంగ్రెస్(Congress)పై విమర్శల అస్త్రాలు కురిపించారు. అర్బన్ నక్సల్స్ చేతిలో పార్టీ ఉందన్నారు. యువతను చెడుదారివైపు మళ్లిస్తోందని, డ్రగ్స్ ఫ్లెడర్లర్లలో ఆ పార్టీ నేతలు ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహారాష్ట్ర(Maharastra) యువత ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోదీ, అనంతరం నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు.
అనంతరం వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించి రూ.23,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ వాషిమ్‌లో ప్రారంభించారు. అంతకు ముందు బంజారా ప్రజల గొప్ప వారసత్వాన్ని తెలిపే, బంజారా విరాసత్ మ్యూజియం(Banjara Virasath Musium)ను ఆరంభించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) కింద రూ.1,920 కోట్ల విలువైన 7500కు పైగా ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు, పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే దాదాపు రూ.1300 కోట్ల టర్నోవర్ సామర్థ్యం కలిగిన 9200 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
…………………………………………