* ఆయన కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను రాహుల్ చించేయలేదా?
* నెహ్రూకుటుంబేతర ప్రధానులను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు
* ఆ పెద్దమనిషి చనిపోయాక రాహుల్ ప్రేమ ఒలకబోస్తున్నారు
* వాజ్ పేయి తరహాలోనే కేంద్రం మన్మోహన్ అంత్యక్రియలను నిర్వహించింది
* మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటుకు నిర్ణయం
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్ డెస్క్ : మన్మోహన్ మరణంతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishanreddy)కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానులుగా పనిచేసిన నెహ్రూ కుటుంబేతర వ్యక్తులను ఆ పార్టీ ఎప్పుడూ గౌరవించలేదని తెలిపారు. మన్మోహన్ మరణం దేశానికి తీవ్ర లోటన్న కిషన్ రెడ్డి.. ఆయన గౌరవానికి భంగం కలగకుండా కేంద్రం అంతిమసంస్కారాలు నిర్వహించిందని తెలిపారు. వాజ్ పేయి(Vajpay) తరహాలోనే అన్ని కార్యక్రమాలూ నిర్వహించామన్నారు. మన్మోహన్ (Manmohan)కేబినెడ్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ(Rahul Gandhi) చించేసిన విషయాన్ని ఎవరూ మరచిపోరని తెలిపారు. ఇప్పుడు రాజకీయం కోసం పెద్ద మనిషిమీద రాహుల్ దొంగ ప్రేమలు ఒలకబోస్తున్నారని ఆరోపించారు. నాడు మన్మోహన్ ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు సమయంలో కనీసం ఆయన కార్యాలయానికి సంబంధించిన పనుల్లో కూడా స్వతంత్రత ఇవ్వలేదన్నారు. పార్టీలకు అతీతంగా మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
…………………………………….