* మానవత్వం లోపించినట్లనిపించింది
* ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది
* అల్లు అర్జున్ ను ఏకాకిని చేశారు
* పేరు చెప్పలేదని అరెస్ట్ చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు
ఆకేరు న్యూస్, అమరావతి : పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (PavanKalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. మానవత్వం లోపించినట్లనిపించిందని అన్నారు. అభిమాని చనిపోయిందని తెలియగానే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందని సూచించారు. అల్లు అర్జున్ కాకపోయినా, మైత్రీ మూవీ టీం (Mythri Movie Team) అయినా వెళ్తే బాగుండేదని వెల్లడించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun)ను ఏకాకిని చేశారన్నారు. ఓ ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరును బన్నీ పలకలేదని అరెస్ట్ చేసేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాదని వెల్లడించారు. ఆయన స్థాయి అది కాదన్నారు. రేవంత్ (Revanth) సినిమా పరిశ్రమకు అండగా ఉంటున్నారని, పుష్ప సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వడమే అందుకు నిదర్శనాలన్నారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
