
* మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండామురళి అన్నారు. ఆదివారం ఆయన పిసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. వరంగల్ నేతలపై గతంలో కొండా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఇరు వర్గాలు పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరై వివరణ ఇచ్చారు.. ఈ సార్ కొండా మురళి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ ఆదేశం మేరకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని మొదటి నుంచి తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఎదిగానని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అన్నారు.
…………………………………………………