* లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం స్ర్కూ టినీ
* హైదరాబాద్కు కురియన్ కమిటీ
* దానం, సునీతారెడ్డి, గడ్డం రంజిత్, కడియం కావ్యలతో భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha elections) సగం స్థానాల్లో ఓటమి చెందడానికి గల కారణాలపై కాంగ్రెస్ (Congress) అధిష్టానం విశ్లేషిస్తోంది. ఈమేరకు ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ (Kurien Committee) గాంధీభవన్ (Gandhi Bhavan) కు చేరుకుంది. సికింద్రాబాద్ (Secunderabad) లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ (Danam Nagender), మల్కాజిగిరి (Malkajigiri), చేవెళ్ల (Chevella) నుంచి పోటీ చేసిన సునీతారెడ్డి (Sunita Reddy), గడ్డం రంజిత్ రెడ్డి (Gaddam Ranjith Reddy) లతో భేటీ అయ్యారు. ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రచారంలో పార్టీ నేతల సహకారం, ఎవరు సహకరించలేదు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ (Warangal) నుంచి గెలిచిన కడియం కావ్య (Kadiam Kavya) తో కూడా భేటీ అయ్యారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో కురియన్ కమిటీ భేటీ (Kurien Committee Review meeting) కొనసాగుతోంది. లంచ్ తర్వాత సాయంత్రం 7 గంటల వరకు మిగతా అభ్యర్థులతో భేటీ కానున్నారు. భేటీ అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ, పార్టీలో లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదో మంచి అవకాశం అన్నారు. ఈ విధానం దేశంలో ఏ పార్టీలోనూ లేదని చెప్పారు. గెలిచిన చోట ఎక్కడెక్కడ ఎంత మెజారిటీ వచ్చిందో అడిగి తెలుసుకున్నారని కావ్య తెలిపారు.
—————————