Congress leader Pranav, CMRF Cheques Distribution
* సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
* రూ. 18 లక్షల విలువైన చెక్కుల అందజేత
* కమలాపూర్ మండల పరిధిలో మన ఊరు-మన కాంగ్రెస్-మన ప్రణవ్ కార్యక్రమం
ఆకేరు న్యూస్, కమలాపూర్: వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ సీఎంఆర్ఎఫ్ ద్వారా అర్హులైన పేదలకు మెరుగైన భరోసా కల్పిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. శుక్రవారం మన ఊరు-మన కాంగ్రెస్-మన ప్రణవ్ కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ మండల పరిధిలోని 18 గ్రామాల్లో ఆయన పర్యటించారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, రూ. 18 లక్షల విలువైన 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి గురై, కష్టకాలంలో తమ కుటుంబానికి భోరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇంచార్జి ప్రణవ్కు కృతజ్ఞతలు తెలిపారు.
* ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, గడపగడపకు వెళ్తున్న సమయంలో ప్రజల నుంచి వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఝాన్సీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్, డీసీసీ కార్యదర్శి మాట్ల రమేష్, మాజీ మండల అధ్యక్షుడు బొల్లం రాజిరెడ్డి, కమలాపూర్ ఉపసర్పంచ్ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు తడక శ్రీకాంత్, కెత్త రవి, పాక చంద్రమౌళి, మాట్ల కళ్యాణ్, గంధశ్రీ అనిల్, మండేద్దుల నాగరాజు మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్ముల శ్రీకాంత్, నవీన్, పైసా శరత్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
