Mulugu Krishna Janmashtami Celebrations
ఆకేరు న్యూస్, ములుగు: మండల వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మండల ప్రజలు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు .ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అత్యంత ఉత్సాభరితంగా ఈ వేడుకలను నిర్వహించు కున్నారు. రాధా కృష్ణ , గోపికలు తదితర వేషధారణలతో పలువురు చూపరులను ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇందిరానగర్ లో ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు సోలం కృష్ణయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు రేణుక హాజరయ్యారు. శ్రీకృష్ణుని వేషధారణ తో విద్యార్థులు గోపికలు వేషధారణతో విద్యార్థినులు చాలా ఉత్సాహంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత ,నవ్య, రాజ్ కుమార్, పాఠశాల సిబ్బంది రాధిక, రమ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా మండలంలోని కాటాపూర్ ,బీరెల్లి, తాడ్వాయి, నార్లాపూర్, మేడారం, తదితర గ్రామాలలో యువతీ యువకులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
