* బీఆర్ ఎస్, బీజేపీ ఫిర్యాదులు
* మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు
* ఈవీఎంలో సీరియల్ నెంబర్ 1 సరిగా లేదు : దీపక్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. గంటకు 5 శాతం చొప్పున మాత్రమే పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.2 శాతం గా పోలింగ్ నమోదైంది. దీంతో ఓటర్లు తరలివచ్చి ఓటేయాలంటున్న అధికారులు, అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. కాగా కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారంటూ బీఆర్ ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో కొన్నిచోట్ల వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. బోరబండ స్వరాజ్ నగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య స్వల్ప వివాదం జరిగింది. కార్పొరేటర్ ఫసియుద్దీన్ తమపై దాడి చేశారంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాలకు భయపడి ఓట్లు వేసేందుకు జనం బయటకు రావడం లేదని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కూడా కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోంది అంటూ ఆరోపి ంచారు. బీజేవైఎం కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారని అన్నారు. ఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారని, ఈవీఎంలో సీరియల్ నెంబర్ 1 సరిగ్గా లేదని, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
……………………………………………..
