Congress Rally in station ghanpur
* కాంగ్రెస్ భారీ ర్యాలీ
* తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాతా మధును శాసన మండలి నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
* శివాజీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ
స్థానిక శివాజీ సెంటర్ నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ నిరసన ర్యాలీ గాంధీ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
* బీఆర్ఎస్ నేతల తీరుపై రాంబాబు విమర్శలు
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మాట్లాడుతూ.. అధికారాన్ని కోల్పోయామన్న అక్కసుతో బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ తదితరులు నిరసనల పేరుతో ప్రజాస్వామ్య విలువలను పక్కనపెట్టి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వమే దాడులు చేయించిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
* కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గమనిస్తున్నారు
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాంబాబు అన్నారు. అయితే ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ తాడికొండ వినయ్ కుమార్, వైస్ చైర్పర్సన్ రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్లు రవి, స్వరూప రాజయ్య, సంగీత రమేష్, హరినాథ్, సంపత్ రాజ్, అనుష రాజు, కృష్ణవేణి సారయ్య, లక్ష్మి, కుమార్, మండల పార్టీ అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, కోళ్ల రవి, చిర్ర నాగరాజు, నూకల ఐలయ్య, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు, కోఆప్షన్ సభ్యులు లతా శంకర్, ఎన్ఎస్యూఐ నాయకులు జానీ, కొలిపోక సతీష్, చేపూరి వినోద్ కుమార్, బిల్డి వెంకన్న, మోటం శ్రీనివాస్, జీడి రమేష్, తెల్లాకుల రామకృష్ణతో పాటు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
