MRPS Madiga Mahasabha in Madikonda
* మాదిగల హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు
* మహాసభకు భారీ ఏర్పాట్లు..
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి :
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సమక్షంలో తలపెట్టిన జాతీయ సదస్సును విజయవంతం చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ, భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు వేల్పుల ప్రశాంత్ మాదిగ పిలుపునిచ్చారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
* ఉద్యమ కార్యాచరణ పై భవిష్యత్తు ప్రణాళిక
అణగారిన వర్గాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వర్గీకరణ అంశంలో చారిత్రాత్మక పురోగతి సాధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా పరిష్కారం కావలసిన అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని నాయకులు స్పష్టం చేశారు.
* హాజరుకానున్న మందకృష్ణ మాదిగ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. ఈ మహా సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఎమ్మార్పీఎస్, ఎమ్ఎస్పీ జాతీయ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల మరియు గ్రామ స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి రమేష్, రాంనగర్ గ్రామ అధ్యక్షులు కనకం రమేష్, ప్రముఖ నాయకులు మాడుగుల క్రాంతి తదితరులు పాల్గొని సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
