* వైస్ చైర్మన్ రేసులో గట్టు సంగీత, నీల రాజమ్మలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంది. మొత్తం 18 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 13 వార్డులు కాంగ్రెస్ గెలుచుకోగా 5 వార్డులను టిఆర్ఎస్ గెలుచుకుంది. 1వ వార్డు తాటికొండ మధు (బిఆర్ఎస్), 2వ వార్డు గుర్రం హరినాథ్ (కాంగ్రెస్), 3వ వార్డు గుర్రం హైమా (కాంగ్రెస్), 4వ వార్డు బూర్ల రాజేశ్వర్ (బిఆర్ఎస్), 5వ వార్డు చల్ల రమ్య (బిఆర్ఎస్), 6వ వార్డు బలగాని అనిల్ గౌడ్ (బిఆర్ఎస్), 7వ వార్డు అన్నెపు సుమలత (కాంగ్రెస్), 8వ వార్డు పొన్న రాజేష్ (బిఆర్ఎస్), 9వ వార్డు సంపత్ రాజ్ (కాంగ్రెస్), 10వ వార్డు తోకల అనూష (కాంగ్రెస్), 11వ వార్డు నీల రాజమ్మ (కాంగ్రెస్), 12వ వార్డు గట్టు సంగీత (కాంగ్రెస్), 13వ వార్డు తాటికొండ వినయ్ కుమార్ (కాంగ్రెస్), 14వ వార్డు పెసరు కృష్ణవేణి (కాంగ్రెస్), 15వ వార్డు బొల్లు లక్ష్మి (కాంగ్రెస్), 16వ వార్డు అంగడి రజిత (కాంగ్రెస్), 17వ వార్డు పొన్నం స్వరూప (కాంగ్రెస్), 18వ వార్డు పొన్న రవి (కాంగ్రెస్) మొత్తం 18 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్, 5 వార్డులు బిఆర్ఎస్ గెలుచుకున్నారు.
” చైర్మన్ తాటికొండ వినయ్ ?
బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో ఎస్సీ రిజర్వుడ్ చేసిన చైర్మన్ పీఠం 13వ వార్డు నుంచి గెలుపొందిన తాటికొండ వినయ్ (సన్నీ)ని వరించనుంది. వైస్ చైర్మన్ పదవి కోసం 11వ వార్డు నుండి గెలుపొందిన నీల రాజమ్మ, 12వ వార్డు నుండి గెలుపొందిన గట్టు సంగీతలు పోటీ పడనున్నారు.
—————————-
