
* సీజనల్ వ్యాధుల పట్ట అప్రమత్తంగా ఉండాలి
* ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
*జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుత వర్షాకాల సీజన్ లో వైద్యాధికారులు సిబ్బంది ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ రోగులకు నిరంతరం వైద్య సేవలు అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ వైద్య అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆయన అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో ఆయన మాట్లాడుతూ వర్షా కాలం లో సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులకు వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వైద్యం సరిగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.రోగులు వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు.ఆసుపత్రిలోని పరిసర ప్రాంతాల్లో పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శానిటేషన్ వారికి సూచించారు. దూర ప్రాంతాల నుండి వస్తున్న రోగులకు ఆహారం అందించే దాంట్లో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత నిప్పుల భిక్షపతి,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల రేవంత్ యాదవ్,మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,యూత్ నాయకులు రమణాకర్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………