
* సహజీవనం చేస్తున్న మహిళ నెట్టేయడంతో మృతి
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మం నేతాజీనగర్‌లో ఓ కాంట్రాక్టర్ హత్య(MURDER)కు గురయ్యాడు. కొన్నేళ్లుగా ఓ మహిళతో ఆయన సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలల క్రితం ఆ మహిళతో పాటు సత్తుపల్లి నుంచి ఖమ్మానికి ఆయన వచ్చారు. అర్ధరాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో రవిప్రసాద్(RAVI PRASAD)ను నెట్టేయడంతో గోడకు తల తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రవిప్రస్తాద్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………..