
* రేవంత్ సర్కార్కు కేటీఆర్ డిమాండ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిరదని.. అమెరికా నుంచి ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలామంది నష్టపోయారని కేటీఆర్ తెలిపారు. అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయనను రానివ్వలేదన్నారు. అదానీ విషయంలో బడే భాయ్ ఆదేశించగానే.. చోటే భాయ్ అదానీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికాడని కేటీఆర్ పేర్కొన్నారు.
……………………………………….