* రద్దును అధికారికంగా ధృవీకరించని విదేశాంగ శాఖ
ఆకేరు న్యూస్ డెస్క్ : యెమెన్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్నభారతీయ నర్సు నిమిషప్రియ కేసు మరో మలుపు తిరిగింది. నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ప్రకటన వెలువడినట్లు వార్తులు వచ్చాయి.భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ కార్యాలయం కూడా ప్రకటించింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక వెలువడలేదు.
ఎవరీ నిమిషప్రియ
.కేరళలోని పాలక్కాడ్ కు చెందిన నిమిషప్రియ కేరళలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత బతుకుదెరువు కోసం 2011లో ఆమె యెమెన్ దేశానికి వెళ్లింది.ఈ క్రమంలో ఖతార్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న టీమీ థామస్ తో పెళ్లి జరిగింది. వారికి మిచెల్లీ టామీ అనే కూతురు ఉంది. ఈ క్రమంలో 2014లో యెమెన్ లో అంతర్యుద్ధం చెలరేగి రాజకీయ అస్తిత్వం ఏర్పడడంతో నిమిష ప్రియ కుటుంబం కేరళకు వచ్చింది. నిమిషప్రియ భర్త కూతరు కేరళలోనే ఉండిపోగా నిమిషప్రియ మాత్రం తిరిగి యెమెన్ వెళ్లిరాజధాని సనాలోని ఓ నర్సింగ్ హోంలో ఉద్యోగంలో చేరింది.
అబ్దోమహదితో పరిచయం
ఈ క్రమంలో అబ్దో మహదితో పరిచయం ఏర్పడింది. అబ్దో మహది తో కలిసి సనాలో ఓ నర్సింగ్ హోం ప్రారంభించింది. అబ్దో మహది నిమిష ప్రియను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా ఆమె ఇండియాకు రాకుండా పాస్ పోర్ట్ తీసుకున్నాడు. అబ్దో మహది నుంచి పాస్ పోర్ట్ ను ఎలా తీసుకోవాలో తెలియక మహదికి మత్తు మందు ఇచ్చిన నేపధ్యంలో మత్తు మందు డోస్ ఎక్కువై అతను మరణించినట్లు యెమెన్ కోర్టు ధృవీకరించింది.నిమిష ప్రియకు ఉరిశిక్ష విధిస్తూ 2017లో కోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుండి పలు కారణాలతో వాయిదా పడుతున్న ఉరిశిక్ష గత నెల జూన్ 16ను ఉరిశిక్ష ఖరారు అయింది.అయితే చివరి క్షణంలో ముస్లిం మత పెద్దలు భారత ప్రభుత్వం జోక్యంతో జూన్ 16న పడాల్సిన ఉరి శిక్షవాయిదా పడింది. ఈ నేపధ్యంలో మత పెద్దలు భారత ప్రభుత్వం మహది కుటుంబంతో యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపంది. మహది కుటుంబానికి బ్లడ్ మనీ రూపంలో 11 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుండి సస్పెన్స్ కొనసాగుతోంది.
సంక్షోభంలో యెమెన్
యెమెన్ దేశం గత పదేళ్లుగా సంక్షోభంలో ఉన్న నేపధ్యంలో అక్కడ స్థిరమైన ప్రభుత్వం లేక పోవడంతో నిమిష ప్రియ కేసు విషయంలో క్లారిటీ రాలేకపోతోంది. నిమిష ప్రియ కేసు జరిగిన ప్రాంతం యెమెన్ లో హౌతీల అధీనంలో ఉంది. ప్రపంచదేశాలు హౌతీల ప్రభుత్వాన్ని దౌత్యపరంగా గుర్తించడం లేదు. అయినా భారత ప్రభుత్వం చొరవతీసుకొని హౌతీలతో సంప్రదింపులు జరుపుతోంది. నిమిష ప్రియ కేసు విషయంలో ఉరిశిక్షను రద్దు చేయించడానికి ముస్లిం మత గురువు గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ యెమెన్ మత పెద్దలతో యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలో యెమెన్ ప్రభుత్వం సోమవారం నిర్వహించిన అత్యున్నత సమావేశంలో నిమిషప్రియ ఉరిశిక్షను రద్దు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఇప్పటి వరకు యెమెన్ ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆదేశాలు రాలేదు. భారత విదేశాంగ శాఖ కూడా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
…………………………………..
