* పది రౌండ్లలో లెక్కింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, ఈ మేరకు కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి కర్ఝన్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని నియమించారు. మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఫలితాలను ఎప్పటికప్పుడు చూసుకునే విధంగా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. అనుమతి ఉన్న వారు మాత్రమే కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతి ఇస్తారని కర్జన్ తెలిపారు.
