
ఆకేరున్యూస్, నల్లగొండ: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శాసనమండలిలో ఖాళీ అయిన రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. మొదటపోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టి లెక్కించనున్నారు. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50 శాతానికిపైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తెలకపోతే కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన నల్లగొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓకే కౌంటింగ్ హల్లో 25 టేబుళ్లపై కౌంటింగ్ చేపట్లాడుతున్నారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 24,139 ఓట్లు పోలయ్యాయి.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ల ఓట్ల లెక్కింపునకు 22 టేబుళ్లు, ఉపాధ్యా య ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, నల్లగొండ ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 25 టేబుళ్లు ఏర్పాటుచేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. కౌంటిం గ్ కోసం సిబ్బందిని 3 షిఫ్ట్‌లుగా ఏర్పాటుచేశారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.
…………………………………..