
* దేశ వ్యాప్తంగా మూడు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు
ఆకేరు న్యూస్, డెస్క్ : కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు వేలకు చేరువవుతున్నాయి. అధికారికంగా ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,700 దాటినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కరోనాతో గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. అత్యధికంగా కేరళ(KERALA)లో 1147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, రాజధాని ఢిల్లీలో 224 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో 223, కర్ణాటకలో 148 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 148, బెంగాల్ లో 116 కేసులు అధికారికంగా నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో తీవ్రత ఉండడం లేదని, అప్పటికే వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారికే ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.
………………………………………….