
ఆకేరు న్యూస్ డెస్క్ : మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి సీపీ రాధాకృష్ణన్ తప్పుకున్నారు. నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపధ్యంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.దీంతో మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను రాష్ట్రపతి ముర్ము గుజరాత్ గవర్నర్కు బదిలీ చేశారు.ఇక సీనియర్ నేత దేవవ్రత్ ఆగస్టు 2015 నుంచి జులై 2019 వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. జులై 2019 నుంచి గుజరాత్ గవర్నర్గా సేవలందిస్తున్నారు.
—————————