* తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయే ప్రయత్నం చేశారు
* మహిళలను కించపరిస్తే సహించేది లేదు
*ఆధారాలు లేకుండా ఎలా విమర్శలు చేస్తారు
* హైదరాబాద్ సీపీ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళా ఐఏఎస్ పై ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాలు
ప్రసారం చేసినందుకే ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు న్యాయపరంగానే వ్యవహరించారని సీపీ అన్నారు. సర్నలిస్టులకు ముందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జర్పలిస్టులు ఏ తప్పు చేయకుంటే సెల్ ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఎందుకు బ్యాంకాక్ పారి పోయే ప్రయత్నం చేశారని సీపీ ప్రశ్నించారు. ఏ తప్పు చేయన్పుడు విచారణకు రావాలి కదా అన్నారు. జర్నలిస్లులను న్యాయపరంగానే అరెస్టు చేశామని వారిని చట్టం ముందు ప్రవేశ పెడతామని సీపీ అన్నారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని వారిని కించ పరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని సజ్జనార్ అన్నారు. మహిళలు గురించి మాట్లాడే ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. అందరి ఇళ్లల్లో ఓ అక్క ఓ చెల్లి, ఓ అమ్మ ఉంటుందని సజ్జనార్ గుర్తుచేశారు.గౌరవమైన హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ గురించి ఇష్ట వచ్చినట్లు కథనాలు ప్రసారం చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. స్త్రీ అంటే ఓ సృష్టి లాంటిదని ప్రకృతి కి మూలం అమ్మ అని అలాంటి అమ్మను అవమాన పరిస్తే చూస్తూ ఊరుకోమని సజ్జనార్ హెచ్చరించారు.
………………………………………………….

