* సీపీ సజ్జనార్ కు అభిమాని ఫిర్యాదు
* బాధ్యులను శిక్షించాలని విజ్ఞప్తి
ఆకేరున్యూస్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ వీడియోలు తీస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని పోలీసులను ఆశ్రయించాడు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి సీపీ సజ్జనార్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. బాధితులను గుర్తించి సైబర్ క్రైం కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మురళి సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు నందిపాటి మురళి తెలిపారు.
