CP Swetha Inspection Warangal
* పోలీసులు ప్రజల సేవకులే
* ఫిర్యాదులపై తక్షణమే స్పందించండి – సీపీ
ఆకేరు న్యూస్, వరంగల్: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె తొలిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు.
* పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల తనిఖీ
పోలీస్ స్టేషన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి గల కారణాలు, కేసుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదు ప్రక్రియ, ఇతర పరిపాలనా అంశాలను పరిశీలించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుంటూ వారి విధి నిర్వహణపై ఆరా తీశారు.
* బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రసీదు అందజేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించారనే నమ్మకం ప్రజల్లో కలిగేలా గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ఉండాలని ఆదేశించారు.
* రాత్రి వేళల్లో అప్రమత్తత అవసరం
స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులను అనవసరంగా ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకూడదని సీపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే అత్యవసర ఫిర్యాదుల విషయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వెంటనే స్టేషన్ అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
* ఆన్లైన్ విధానంలోనే శాఖాపరమైన ఫిర్యాదులు
శాఖాపరమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఇకపై పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే సమర్పించాలని, వాటి పరిష్కార ప్రక్రియను స్టేషన్ అడ్మిన్ ఎస్ఐ పర్యవేక్షించి, బాధ్యతాయుతంగా నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింహరావు, సత్యనారాయణలతో పాటు హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
