Chilpur sub market demand
ఆకేరు న్యూస్ స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో సబ్ మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సాదo రమేష్ మాట్లాడుతూ మండలంలో 17 గ్రామాలలో అనేక మంది రైతులు మెట్ట ప్రాంతాలలో మొక్కజొన్న పంట వేయడం జరిగింది అన్నారు. అట్టి పంటలు రైతులు అమ్ముకోవడానికి అందుబాటు లో మార్కెట్ లేక ప్రైవేట్ దళారులను ఆశ్రయించి రైతులు మోసపోతున్నారు అన్నారు. కావున ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి చిల్పూర్ మండల కేంద్రంలో రైతులు పండించిన ప్రతి పంటను అమ్ముకోవడానికి సబ్ మార్కెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమైనందున వడ్ల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి రైతుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గ్రామంలో మొక్కజొన్న, వరి పంటల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి మధ్య దళారుల నుండి రైతుల్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు.
*డిమాండ్స్…
1.రైతు భరోస నిధులను వెంటనే ఖాతాలో జమ చేయాలి
2.మండలంలో వెంటనే మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ను వెంటనే అమలు పరుచాలి.
3.ఐకేపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.
4.దేవవాదుల ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపాలి.
5.గౌరవెల్లి వరద కాలువను మల్లన్న గండి ఎడమ కాలువను వెంటనే ప్రారంభించాలి.
6.పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.
7.విద్యుత్ సవరణ చట్టంను వెంటనే వెనక్కి తీసుకోవాలి.
8.మార్కెట్ల ముసాయిదా చట్టాన్ని విరమించుకోవాలి.
9.పంటలకు గిట్టుబాటు ధర గ్యారంటీ చట్టo తేవాలి.
10.అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి.
11.రైతుల పండించిన అన్ని పంటలకు బోనస్ అమలు పరుచాలి.
12.చిల్పూరు మండల కేంద్రంలో సబ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలి.
పై డిమాండ్స్ తో కుడిన వినతిపత్రంను తాసిల్దార్ విజయ్ కుమార్ కి అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమీటి సభ్యులు ఆవుల ప్రభాకర్, పోలు సంపత్, సాదం శ్రీనివాస్, సీఐటీయూ మండల అధ్యక్షులు మంద రాజు, మండల కార్యదర్శి అపారదాపు రాజు, జాగిల్లాపురం కిష్టయ్య, గుండెబోయన సదానందం, సాదం పరమేష్, పోలు శ్రీనివాస్, ఊరడి లింగయ్య, ముడిక బీమయ్య, పురామని శ్రవణ్ లు పాల్గొన్నారు.
