*అర్జున్ టెండూల్కర్ పెళ్లి
*సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ వివాహం!
ఆకేరు న్యూస్, డెస్క్: భారత క్రికెట్ ఆరాధ్య దైవం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు, ఎంట్రప్రెన్యూర్ సానియా చందోక్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 5, 2026న ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు క్రీడ, రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
*వివాహ వేడుక విశేషాలు:
దక్షిణ ముంబైలోని ఒక ప్రైవేట్ వేదికపై హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరిగింది. గతేడాది ఆగస్టు 13న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, అప్పటి నుంచే వార్తల్లో నిలుస్తోంది. అర్జున్ టెండూల్కర్ తన తండ్రి అడుగుజాడల్లో క్రికెట్లో రాణిస్తుండగా, సానియా చందోక్ తన వ్యాపార నైపుణ్యంతో ఎంట్రప్రెన్యూర్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్ టెండూల్కర్ ముంబై/గోవా క్రికెటర్ . సానియా చందోక్ గ్రావిస్ గ్రూప్ చైర్మన్ రవి ఘాయ్ మనవరాలు.
ఈ వేడుకలో క్రికెట్ ప్రపంచం నుంచి ఎం.ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు కుడా జారిగాయి. ఈ వివాహానికి ముందు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలను అంబానీ కుటుంబం స్వయంగా నిర్వహించడం విశేషం. సచిన్ టెండూల్కర్‌తో అంబానీ కుటుంబానికి ఉన్న దశాబ్దాల అనుబంధం ఈ వేడుకల్లో ప్రతిబింబించింది. ఆంటీల్యాలో జరిగిన సంగీత్, మెహందీ కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
సానియా చందోక్ కేవలం ఒక వ్యాపారవేత్త మనవరాలిగానే కాకుండా, తనదైన శైలిలో ఎంట్రప్రెన్యూర్‌గా సక్సెస్ అయ్యారు. ఆమె తాత రవి ఘాయ్, భారతదేశంలోని ప్రసిద్ధ గ్రావిస్ గ్రూప్ (Gravis Group) చైర్మన్. ఆతిథ్య మరియు రిటైల్ రంగాల్లో ఈ సంస్థకు గొప్ప పేరుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున్-సానియా పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
