జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్, వరంగల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బస్వాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేశారు. భర్తను కట్టేసి, భార్యపై దాడిచేశారు. నగదు, బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.