CM Revanth Reddy | అమాయకులను వేధిస్తే కఠిన చర్యలు
సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైడ్రా పేరుతో అమాయకులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని అమాయకుల వద్ద వసూళ్లకు పాల్పడుతన్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులపై కూడా తమకు ఫిర్యాదులు అందాయన్నారు. అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టిసారించాలని అధికారుకు సీఎం సూచించారు.