
మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం
*పోలీసులను ఆదేశించిన నాంపల్లి కోర్టు
ఆకేరు న్యూస్. హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ( konda surekha) పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ (ktr)వేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై క్రిమినల్ కేస్ నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు (nampally court) పోలీసులను శనివారం ఆదేశించింది.21 ఆగస్టు 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయాలని కోర్టు సూచించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం,డ్రగ్స్ తో పాటు నటి సమంత(samantha) పై మంత్రి సురేఖ నిరాధార ఆరోఫణలు చేశారని కోర్టు భావించింది. కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్లు నాంపల్లి కోర్టు గుర్తించింది.
———————