ఆకేరు న్యూస్, హైదరాబాద్: సినీ నటుడు నాగార్జునపై కేసు నమోదయింది. సమంత- నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామని నాగార్జున హెచ్చరించిన మరుసటి రోజే ఆయనపై తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జనంకోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదుచేశారు. ఇటీవల మంత్రి సురేఖ అక్కినేని కుటుంబం, సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఫిలిం ఇండస్ట్రీ ముక్త కంఠంతో మండిపడిరది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడారని.. దీనిపై క్షమాపణ చెప్పినా కేసు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంలో నాగార్జునను సైలెంట్ చేయడానికి బెదిరింపు చర్యల్లో భాగంగా కేసు పెట్టారని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.
………………………………………..