
* నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికా సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ (America Shutdown)లోకి వెళ్లింది. నిధుల ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమే ఈ షట్ డౌన్‌కు కారణమైంది. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. సంక్షోభంతో 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందుల్లోకి వెళ్లారు. వారికి జీతభత్యాల నిలిచిపోనున్నాయి. యూఎస్ ప్రభుత్వ కార్యాలయాలలో అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. త్వరలో రాజీ కుదురుతుందని రిపబ్లికన్ నాయకుడు జాన్ థూన్ ఆశాభావం వ్యక్తం చేశారు. షట్డౌన్కు డెమొక్రాట్లే (Democrats) కారణమని డెమోక్రటిక్ నేతలు ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీ ఇది “క్లీన్ ఫండింగ్ బిల్లు” అని పేర్కొంది. రాజకీయ కారణాల వల్ల డెమొక్రాట్లు దీనిని ఆమోదించకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కాగా, ప్రభుత్వాన్ని నడపడానికి నిర్ణీత సమయంలోగా నిధులు మంజూరు చేయడంలో యూఎస్ కాంగ్రెస్ విఫలమైనప్పుడు ప్రభుత్వ షట్‌డౌన్ విధిస్తారు. ఈ సమయంలో వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను జీతం లేకుండా సెలవుపై పంపుతారు. అనేక మంది జీతం లేకుండా పని చేయవలసి వస్తుంది.
……………………………………………