* మగవాళ్ళపై కాకుల దాడి
* సిరిసిల్లలో వింత ఘటన
ఆకేరు న్యూస్, సిరిసిల్ల : కాకులు పగబట్టాయి.. నిజమే మగవాళ్ళ మీదనే కక్ష పెంచుకున్నాయి.. కారణాలు తెలియవు కాని, ఆడవాళ్ళకు మాత్రం కాకులు మినహాయింపు ఇస్తున్నాయి. సోషల్ మీడియాలో మగవాళ్ళను కాకులు తన్నుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ దగ్గరలోని కట్ట మైసమ్మ దగ్గర ఉన్న భార వృక్షం మీద కాకులు నివాసం ఏర్పరచుకున్నాయి. బస్టాండ్ నుంచి లోపలికి , బయటకు వెళ్ళేవారిని టార్గెట్ చేస్తున్నాయి.. అటుగా వెళుతున్న పాద చారులతో పాటు వాహనాలపై వెళుతున్న మగవాళ్ళను కాళ్ళతో తన్నుతున్నాయి.. ఎందుకో ఏమో కారణాలు తెలియక మగవాళ్లు సతమతమవుతున్నారు. కాగా ఆహారం కోసమే కాకులు దాడులు చేస్తున్నాయని కొంత మంది స్థానికులు చెబుతున్నారు.
—————————————————–