
ఆకేరు న్యూస్, ములుగు: చతీస్ ఘడ్ రాష్ట్రం దంతవాడ జిల్లా మరో సారి ఉలిక్కి పడింది.
బాంబు బ్లాస్టింగ్ లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మునీష్ రెండు కాళ్లు కోల్పోయాడు.
దంతవాడ అడవులలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అమర్చిన బాంబు బ్లాస్ట్ అయింది.
ఈ ఘటనలో ముఖేష్ రెండు కాళ్లు కోల్పోయాడు.మనీష్ ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామం, మనీష్ రెండు కాళ్లు కోల్పోయాడని తెలియడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మనీష్ తల్లిదండ్రులు అలెం లింగయ్య సమ్మక్కలు గుండెలవిసిపోయేలా రోధిస్తున్నారు. ప్రస్తుతం మనీష్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
———————–