* పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం
* ఆలస్యంగా వెలుగులోకి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ బోరుబండ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది.
పొద్దున్నే రోడ్లను శుభ్రం చేస్తున్న పారిశుధ్య కార్మికురాలిపై రాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రతీరోజు లాగే బాధితురాలు తన విధులను నిర్వహించేందుకు ఎర్రగడ్డకు వెళ్లింది. తనకు కేటాయించిన పని స్థలంలో విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కార్మికురాలిపై రాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో రాజు.. పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నట్టు సమచారం.
……………………………………..
