* 2 గంటలుగా నిలిచిపోయిన విమానాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఉన్న నీటి ఇబ్బందులకు తోడు.. ఇప్పుడు కరెంట్ (Power) కోతలు కుదిపేస్తున్నాయి. యూపీ(UP) లో పవర్‌గ్రిడ్ ఫేయిల్ (Powergrid fail) కావడంతో దేశ రాజధానిలో చాలా చోట్ల కరెంట్ లేదు. నీటి ఎద్దడితో పాటు కరెంట్ కోతల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉక్కపోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తక్షణమే కరెంట్ కోతలను నివారించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈరోజు ఏకంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi Airport)కు కరెంట్ నిలిచిపోయింది. దీనివల్ల 2 గంటల పాటు పలు విమానాలు(Flights) నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు తీసుకుని విమానాల రాకపోకలను పునరుద్ధరించారు.
————————-