
* మహాత్మా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు
* సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
* శ్రీకాంత్ కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
* సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధి ( MAHATHMA GANDHI)జయంతి అక్టోబర్ 2న మహాత్మా గాంధిపై టాలీవుడ్ సినీ నటుడు శ్రీకాంత్ భరత్( SRIKANTH BHARATH) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెల్సిందే.. శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుకుపడ్డారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ శనివారం బషీర్ బాగ్ సైబర్ క్రైమ్(CYBER CRYME) లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ (BALMURY VENKAT) మీడియాతో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాక్ స్వాతంత్రం పేరిట హద్దులు మీరి కొంతమంది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.శ్రీకాంత్ భరత్ ను మొత్తం సినీ ఇండస్ట్రీ వెలివేయాలని డిమాండ్ చేశారు. ఇది సినిమా పరిశ్రమకే అవమానం అన్నారు.
త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచుని కలిసి శ్రీకాంత్ భరత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామని పేర్కొన్నారు . గాడ్సే వారసులమని చెప్పుకునే కొంతమంది జాతిపిత మహాత్మాగాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శ్రీకాంత్ భరత్‌పై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కోరారు.
శ్రీకాంత్ భరత్ ఏమన్నారంటే…
గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ భరత్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులు గాంధీ స్త్రీలోలుడు అని అమ్మాయిలని లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఇంకా తాను గాంధీపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ మరో వీడియో విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు నన్ను తిట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారని అయినా నేను పట్టించుకోను అంటూ సమర్థించుకున్నారు. శ్రీకాంత్ భరత్ చేసిన వ్యాఖ్యలపై గాంధేయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ శ్రీకాంత్ భరత్ ను పిచ్చాసుపత్రిలో అడ్మిట్ చేయాలంటూ సలహా ఇవ్వగా కొంతమంది నెటిజన్లు శ్రీకాంత్ భరత్‌ను సమర్థిస్తూ పోస్లులు పెడుతున్నారు.
…………………………………….