* అల్లకల్లోలంగా ఉప్పాడ సముద్రం
* ఇంటింటికీ తిరిగి అధికారుల హెచ్చరికలు
* పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచన
ఆకేరు న్యూస్, కాకినాడ : మొంథా తుఫాను తీవ్రతకు ఏపీ (AP) వణుకుతోంది. ప్రభావిత హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వారికి తగిన భరోసా కల్పిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది. తుఫాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్రం కల్లోలం మారింది. ఎనిమిది కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డు దెబ్బతింది. అధికారులు పోర్టులో 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ సాయంత్రం లేదా అర్ధరాత్రి మొంథా తుఫాను తీరం దాటనుంది. సహాయక చర్యల కోసం కాకినాడ (KAKINADA) పరిసర ప్రాంతాల్లో ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది ఇప్పటికే మోహరించి ఉన్నారు. ఉప్పాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్‌తో పాటు ఎస్డీఆర్ ఎఫ్ టీములు సహాయక చర్యల కోసంసిద్ధంగా ఉన్నాయి. గాలి బీభత్సంగా ఉంటుందని, దయచేసి అందరూ పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులు ఇంటింటటికీ వెళ్లి హెచ్చరిస్తున్నారు.
……………………………………….
