ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : సినీ హీరో ప్రభాస్ న్యూ ఇయర్ వేళ ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. “లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయిమెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు.. మన కోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. సే నో టు డ్రగ్స్.. మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసైతే టోల్ ఫ్రీ నంబర్ (8712671111)కు కాల్ చేయండి.. వారుపూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.”అని తెలిపారు. బాధితులు కోలుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
