* రైతు నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
ఆకేరున్యూస్, జనగామ: రైతునుంచి లంచం తీసుకుంటున్న విద్యుత్ శాఖ అధికారిని ఏసీబీ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు రైతు కుంభం ఎల్లయ్య రూ.16 లక్షలు డీడీ కట్టాడు. డీడీ కట్టిన తరువాత రెండు నెలలుగా అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో పనిచేసేందుకు DE హుస్సేన్ నాయక్ రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం రైతునుంచి రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు డీఈ హుస్సేన్నాయక్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.