
* బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసహనం వ్యక్తం చేశారు. అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. 15 నెలల్లో రూ లక్షా 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2,500 ఇచ్చారని ప్రశ్నించారు. ఎంతమంది వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారన్నారు. ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారని, తులం బంగారం ఎంతమందికి ఇచ్చారని నినదించారు. అనంతరం మండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామన్నారు. సభలో ప్రజల సమస్యలు చర్చించడం లేదని, కేవలం బిల్లులు ప్రవేశపెట్టడం పాస్ చేయించుకోవడమే జరుగుతున్నదని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల వల్ల ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చేవన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తూతూ మంత్రంగా సభను నడిపిస్తున్నరని, పనిగంటలు తగ్గించారన్నారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజా క్షేత్రంలో పోరాడుతామని స్పష్టం చేశారు. 15 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేశామని చెబుతున్నారని, 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 4 లక్షల 17 వేల కోట్లు అని ఎమ్మెల్సీ కవిత (Mls Kavitha)అన్నారు.
………………………….