
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రామీణ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkatreddy) తెలిపారు. రాష్ట్ర రహదారులకూ టోల్ విధించే ఆలోచన లేదని వెల్లడించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా ఇచ్చారు. మూడు నెలలకో, ఆరు నెలలకో చెల్లలిస్తామని తెలిపారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్డు వేయిస్తామని వివరించారు. బీఆర్ ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని, ఆ మూడు చోట్ల రోడ్లకు సింగరేణి నిధులను కూడా వాడారని విమర్శించారు. చాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harishrao)తెలిపారు. బీఆర్ ఎస్ హయాంలో ఆర్ అండ్‌బీ పనుల కోసం లెక్కలు తీద్దామన్నారు. ఒకరోజు రోడ్ల గురించే ప్రత్యేకంగా చర్చిద్దామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రమంతా రోడ్లు వేశామని హరీశ్‌రావు చెప్పారని, మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని సభాపతి ప్రసాద్ (Prasad) నవ్వులు పూయించారు.
………………………………..