* పేలుడుతో దద్దరిల్లిన రాజధాని
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన ఘటనకు రాజధాని ఢిల్లీయే కాదు యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. నిత్యం రద్దీగా ఉండే చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 17 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక ఈ పేలుడుపై దర్యాప్తు జరిపే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐ ఏ జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ పేలుడు ఘటనపై దర్యాప్తు జరిపి త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. వివేదిక ప్రకారం కేంద్రపభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది.
……………………………………………………………………
