- కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీస్ బలగాలు
- ఏక్షణంలో అరెస్ట్ చేస్తారోనన్న టెన్షన్.. టెన్షన్
- ఆకేరు న్యూస్ , న్యూ ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఈడీ అధికారులు అరెస్ట్ ( CM Arvind Kejriwal Arrest ) చేశారు. ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈడీ (ED ) అధికారుల బృందం రావడం, సీఎం కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. సమాచారం అందుకున్న ఆప్ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉధ్రిక్త వాతావరణం నెలకొన్నది. సెర్చ్ వారెంట్ (Search Warrant )తో ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు చేశారు. మద్యం పాలసీకి సంబందించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడిగా ఉన్నారు. దీంతో అధికారులు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈడి విచారణ నుంచి మినహాయింపు నివ్వాలనీ ఢిల్లీ హైకోర్టు ( Delhi HighCourt )ను ఆశ్రయించారు. అయినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ( Suprem Court )ను ఆశ్రయించారు. ఈలోపే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. అరెస్ట్ ( CM Arvind Kejriwal Arrest ) చేశారు. అక్రమంగా ఈడీ అధికారులు కేజ్రీ వాల్‌ను అరెస్ట్ చేశారని ఆప్ నేతలు అంటున్నారు. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ మరోనేత విజయ్ నాయర్ లతో పాటు తెలంగాణ మాజీ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టయినారు.
- —————-
Related Stories
September 15, 2024
September 15, 2024