
నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు.. విచారణ గురువారానికి వాయిదా
* స్పష్టం చేసిన సుప్రీమ్ కోర్టు
ఆకేరు న్యూస్, ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీం కోర్ట్‌లో ఫిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్లు రాజ్యాంగానికి లోబడే ఉంటాయని జస్టస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం తీర్పు నిచ్చింది. జమ్మూ కశ్మీర్లో డీలిమిటేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో ఆంధ్రపదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో డీలిమిటేషన్ చేయాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీం కోర్ట్‌లో ఫిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎందుకు అసెంబ్లీ స్థానాలను పెంచడంలేదని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి మాత్రమే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ పరిధిలోనే ఢీలిమిటేషన్ జరగాలని, లేకుంటే ఇలాంటి డిమాండ్లకు ఊతమిచ్చినట్లవుతుందని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల పెంపును కలిపి చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
……………………………………..