* అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్‌ను రెగ్యులరైజ్ చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి తీసుకోకుండా ఆఫీస్ కట్టి… ఇప్పుడు రెగ్యులరైజ్ చేయాలని అడగడం ఏంటని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చేయాలని స్పష్టం చేసింది. దీంతోపాటు దానికి అయ్యే ఖర్చును నష్టపరిహారం రూపంలో లక్షరూపాయలను బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని తేల్చి చెప్పింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు పిటిషనర్‌ను అడిగింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది.
……………………………