* పెరుగుతున్న వాతావరణ కాలుష్యం
* జనం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ(DELHI)లో వాతావరణం ప్రమాదకర ఘంటికలు మోగిస్తోం ది. దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. దీని వల్ల రోడ్డుపై ఎవరు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ పొలుష్యన్ (Air Pollution) తో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. తీవ్రంగా కొనసాగుతోంది. రోజురోజుకూ కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంది. ఈరోజు కూడా గాలి నాణ్యత సూచి అధ్వానంగా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 349గా నమోదైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 (తీవ్రమైన స్థాయి)కి పైనే నమోదైంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో ఆప్ సర్కారు అప్రమత్తమైంది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతోంది. కాలం తీరిన వాహనాలను నిషేధించడం, అధిక పొల్యూషన్ ప్రాంతాల్లో నీళ్లను చిమ్మడం వంటి చర్యలు చేపడుతోంది.
…………………………………….