* ప్రపంచానికి జాతరను పరిచయం చేస్తాం
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఆకేరు న్యూస్, ములుగు: సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్ల పై సమీక్షించి తదుపరి మీడియా తో మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 251 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం 150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను 101 కోట్లు విచ్చిస్తున్నట్టు వివరించారు. నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. అనంతరం మంత్రుల బృందం మేడారం సమ్మక్క ,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకుని ఆదివాసి ఆచార సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజలు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం మంత్రుల బృందాన్ని సన్మానించి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

…………………………………………………………….

